అర్హులకు పాదర్శకంగా సంక్షేమ పథకాలు

ABN , First Publish Date - 2021-12-29T05:17:42+05:30 IST

అర్హులైనవారందరికి ప్రభుత్వం పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందజేస్తుందని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు.

అర్హులకు పాదర్శకంగా సంక్షేమ పథకాలు
చెక్కును అందజేస్తున్న మంత్రి సుచరిత, కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌, ఎమ్మెల్యేలు, జేసీలు

హోం మంత్రి మేకతోటి సుచరిత 

గుంటూరు, డిసెంబరు 28: అర్హులైనవారందరికి ప్రభుత్వం పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందజేస్తుందని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల్లో అర్హత ఉండి మిగిలిపోయిన వారికి సీఎం జగన్‌ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా నగదు జమ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ హాల్లో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌కు హోంమంత్రి సుచరిత, కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టినా ఇతర నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా తాడికొండ, గుంటూరు తూర్పు, ప్రత్తిపాడు నియోజకవర్గంలో లబ్ధిదారులకు ఇంటి పట్టాలను పంపిణీ చేశారు.  అనంతరం హోంమంత్రి మాట్లాడుతూ జిల్లాలో వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ కింద  80620 మందికి రూ.5.35 కోట్లు, వైఎస్‌ఆర్‌ ఆసరా కింద 610 మందికి రూ.0.39 కోట్లు, నేతన్న నేస్తంకింద 21 మందికి రూ. 5లక్షలు, వైఎస్‌ఆర్‌ చేయూత పథకం కింద 17,741 మందికి రూ.33.26 కోట్లు, కాపు నేస్తం కింద 2344 మందికి రూ.3.52 కోట్లు జమ చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు ఎండీ ముస్తఫా, మద్దాళి గిరిధర్‌, మేరుగ నాగార్జున, డాక్టర్‌ ఉండవల్లి శ్రీదేవి, జేసీలు ఏఎస్‌ దినేష్‌కుమార్‌, రాజకుమారి  కే శ్రీధర్‌రెడ్డి,  కార్పొరేషన్‌ చైర్మన్‌లు మండేపూడి పురుషోత్తం, కోలా భవాని, డిప్యూటీ మేయర్‌ షేక్‌ సజీల, డీఆర్‌వో కొండయ్య, డీఆర్‌డీఏ పీడీ ఆనందనాయక్‌, ఆర్డీవో భాస్కరరెడ్డి, ఎల్డీఎం ఈదర  రాంబాబు, కలెక్టరేట్‌ ఏవో మోహన్‌రావు, జిల్లా అధికారులు ఉన్నారు.  

 

Updated Date - 2021-12-29T05:17:42+05:30 IST