విశాఖ శారదాపీఠం సేవలు అభినందనీయం

ABN , First Publish Date - 2021-11-09T05:43:49+05:30 IST

సనాతన హైందవ సంప్రదాయాలకు నిలయంగా విశాఖ శారదాపీఠం సేవలందించటం అభినందనీయమని హోంమంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు.

విశాఖ శారదాపీఠం సేవలు అభినందనీయం
ఆహార పొట్లాలను పంపిణీ చేస్తున్న హోంమంత్రి సుచరిత, ఏసురత్నం తదితరులు

హోంమంత్రి సుచరిత 

గుంటూరు, నవంబరు 8: సనాతన హైందవ సంప్రదాయాలకు నిలయంగా విశాఖ శారదాపీఠం సేవలందించటం అభినందనీయమని హోంమంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి జన్మదినవేడుకలు పురస్కరించుకొని వైసీపీ రాష్ట్ర బ్రాహ్మణ అధ్యయన కమిటీ సభ్యుడు కోనూరు సతీష్‌శర్మ ఆధ్వర్యంలో గోరంట్లలోని ప్రభుత్వజ్వరాల ఆస్పత్రిలో రోగులకు పండ్లపంపిణీతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మార్కెట్‌యార్డు చైర్మన్‌ చంద్రగిరి ఏసురత్నం,  కార్పొరేటర్‌ తనుబుద్దు కృష్ణారెడ్డి, ప్రత్తిపాడు మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ మెట్టు రాజేశ్వరి, వైస్‌ ఛైర్మన్‌ రవి, మన్నేపల్లి హనుమంతరావు శర్మ, ముత్యాల నాగరాజు, మిన్నకూరి శంకర్‌, వీరయ్య, డొక్కు కాటమరాజు తదితరులున్నారు.

Updated Date - 2021-11-09T05:43:49+05:30 IST