మానవత్వం చాటిన మ్యానకైండ్ ఫార్మా
ABN , First Publish Date - 2021-10-28T05:48:08+05:30 IST
మానవత్వం చాటుకున్న మ్యానకైండ్ ఫార్మా కరోనాతో మృతి చెందిన పోలీసు కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున ఆర్థికసాయం అందించింది.

చెక్కులు అందించిన హోంమంత్రి సుచరిత
గుంటూరు, అక్టోబరు 27: మానవత్వం చాటుకున్న మ్యానకైండ్ ఫార్మా కరోనాతో మృతి చెందిన పోలీసు కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున ఆర్థికసాయం అందించింది. ఈ మేరకు బుధవారం క్యాంప్ కార్యాలయంలో హోంమంత్రి సుచరిత పోలీసు కుటుంబాలకు చెక్కులు అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనాతో మృతి చెందిన పోలీసులకు ఆర్థిక సాయం అందిస్తున్నట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రజలు బయటకు రావటానికే భయపడిన సందర్భంలో పోలీసు సిబ్బంది ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించటం గొప్పవిషయమన్నారు.
హోంగార్డుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన, గాయపడిన హోంగార్డుల కుటుంబాలకు రూరల్ ఎస్పీ విశాల్‌గున్నీ చెక్కులు అందజేశారు. గత ఏప్రిల్ 9న పెదనందిపాడు పరిధిలోని వరగాని వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఏఆర్ కానిస్టేబుల్ కుటుంబానికి భద్రతా పథకం కింద రూ.10 లక్షల చెక్కు అందించారు. ఏప్రిల్ 3న చిలకలూరిపేట పరిధిలోని మానుకొండవారిపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హోంగార్డు వేముల నిరీక్షణరావు సతీమణి సన్నిధికి న్యూ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స అందించిన ప్రమాద బీమా చెక్కు రూ.10,25,000లను అందజేశారు.