సీఎం పర్యటనను విజయవంతం చేయాలి

ABN , First Publish Date - 2021-11-10T04:59:24+05:30 IST

గుంటూరు మెడికల్‌ కళాశాలలోని జింకానా ఆడిటోరియంలో ఈ నెల 11న సీఎం జగన్‌ పాల్గొననున్న జాతీయ, విద్యా, మైనార్టీ సంక్షేమ దినోత్సవ రాష్ట్రస్థాయి వేడుకను విజయవంతం చేయాలని హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు.

సీఎం పర్యటనను విజయవంతం చేయాలి
సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలిస్తున్న హోం మంత్రి సుచరిత

హోం మంత్రి సుచరిత

గుంటూరు, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): గుంటూరు మెడికల్‌ కళాశాలలోని జింకానా ఆడిటోరియంలో ఈ నెల 11న  సీఎం జగన్‌ పాల్గొననున్న జాతీయ, విద్యా, మైనార్టీ సంక్షేమ దినోత్సవ రాష్ట్రస్థాయి వేడుకను విజయవంతం చేయాలని హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. మంగళవారం ఆమె జిల్లా కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌, ఎమ్మెల్యేలతో కలిసి జింకానా ఆడిటోరియంలో  సీఎం పర్యటన ఏర్పాట్లని పరిశీలించారు. బ్యారికేడింగ్‌, వాహనాల పార్కింగ్‌, రూట్‌మ్యాప్‌, ఇతర వసతులు, భద్రత ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ అనంతరం కలెక్టరేట్‌లోని డీఆర్‌సీ మీటింగ్‌ హాల్‌లో జిల్లా కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. సీఎం పర్యటనలో ఎక్కడా సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు ముస్తఫా, గిరిధర్‌, అర్బన్‌ ఎస్‌పీ ఆరిఫ్‌ హఫీజ్‌, జేసీలు దినేష్‌కుమార్‌, రాజకుమారి, అనుపమ అంజలి, శ్రీధర్‌రెడ్డి, అర్బన్‌ అదనపు ఎస్‌పీ గంగాధరం, డీఆర్‌వో కొండయ్య, డీటీసీ మీరా ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-11-10T04:59:24+05:30 IST