కొత్త అధ్యయానికి గుంటూరు పోలీసులు శ్రీకారం: హోంమంత్రి Sucharita

ABN , First Publish Date - 2021-12-28T17:21:01+05:30 IST

స్పోర్ట్స్ మీట్ నిర్వహణతో గుంటూరు రూరల్ పోలీసులు కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు.

కొత్త అధ్యయానికి గుంటూరు పోలీసులు శ్రీకారం: హోంమంత్రి Sucharita

గుంటూరు: స్పోర్ట్స్ మీట్ నిర్వహణతో గుంటూరు రూరల్ పోలీసులు కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారని  రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. పోలీస్ ఉద్యోగం అంటేనే నిరంతరం ఒత్తిడితో కూడుకున్నదని తెలిపారు. ఎప్పుడు ఏ ఆపద వస్తుందో, ఆటంకాలు వస్తాయో తెలియని పరిస్థితన్నారు. కుటుంబ సభ్యులకు కూడా దూరంగా ఉంటూ విధులు నిర్వహించడం ఒక్క పోలీసులకే సాధ్యమని చెప్పుకొచ్చారు. ఇంత ఒత్తిడితో పనిచేసే వారికి కొంత ఆటవిడుపు అవసరమన్నారు. పని ఒత్తిడితో నిరంతరం విధులు నిర్వహించే పోలీసుల కోసం స్పోర్ట్స్ మీట్ లాంటివి ఎంతో అవసరమని హోంమంత్రి సుచరిత పేర్కొన్నారు. 

Updated Date - 2021-12-28T17:21:01+05:30 IST