కోడెల శివరాం హౌస్ అరెస్టు.. ఇంటి దగ్గర భారీగా మోహరించిన పోలీసులు
ABN , First Publish Date - 2021-11-06T14:28:02+05:30 IST
సత్తెనపల్లిలో టీడీపీ నేత కోడెల శివరాంను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.
గుంటూరు జిల్లా: సత్తెనపల్లిలో టీడీపీ నేత కోడెల శివరాంను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఆయన ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. చంద్రన్న ఆశయ సాధన పేరుతో శనివారం పాదయాత్ర చేసేందుకు కోడెల శివరాం సిద్ధమయ్యారు. రాజుపాలెం నుంచి దేవరంపాడు కొండ వరకు పాదయాత్ర చేయాలని సంకల్పించారు. అయితే పాదయాత్రకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. అయినా పాదయాత్ర చేసితీరుతానని శివరాం స్పష్టం చేశారు. ఈ క్రమంలో కోడెల ఇంటితోపాటు సత్తెనపల్లి నియోజకవర్గంలోని పలువురు టీడీపీ నేతల ఇళ్ల వద్ద కూడా పోలీసులు మోహరించారు. రాజుపాలెం మండలం టీడీపీ అధ్యక్షుడు అంచుల నరసింహారావును కూడా పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.