గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
ABN , First Publish Date - 2021-01-21T05:19:41+05:30 IST
నంబూరు - గుంటూరు రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు గుంటూరు రూరల్ పోలీసులు బుధవారం తెలిపారు.

గుంటూరు (సంగడిగుంట), జనవరి 20: నంబూరు - గుంటూరు రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు గుంటూరు రూరల్ పోలీసులు బుధవారం తెలిపారు. మృతుడి వయస్సు 30 సంవత్సరాలు వుండవచ్చు. నలుపు రంగు ఫుల్‌హ్యాండ్స్ రెడీమేడ్ షర్ట్, నీలం రంగు జీన్స్ ఫ్యాంట్ ధరించివున్నాడు. మృతుడి ఆచూకీ తెలిసినవారు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో గానీ, ఫోన్ 9573341616, 0863-2220753 నెంబర్‌లలో తెలియజేయాలని సూచించారు.