గుంటూరులో కీచక టీచర్ అరెస్ట్
ABN , First Publish Date - 2021-10-25T16:48:29+05:30 IST
విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న కీచక టీచర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

గుంటూరు: విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న కీచక టీచర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాలోని సత్తెనపల్లి కుమ్మరిపాలెం ఉర్దూ స్కూల్‌లో ఉపాధ్యాయుడు హుస్సేన్‌ను అదుపులోకి తీసుకున్నారు. హుస్సేన్‌పై ఫోక్సో యాక్ట్ 354, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.