గుంటూరులో పసుపు రైతులను పరామర్శించిన టీడీపీ నేతలు

ABN , First Publish Date - 2021-07-08T17:18:07+05:30 IST

దుగ్గిరాల మార్కెట్ యార్డులో పసుపు రైతులను టీడీపీ నేతలు పరామర్శించారు.

గుంటూరులో పసుపు రైతులను పరామర్శించిన టీడీపీ నేతలు

గుంటూరు: దుగ్గిరాల మార్కెట్ యార్డులో పసుపు రైతులను టీడీపీ నేతలు పరామర్శించారు. పంట కొనుగోలు,  మద్దతు ధర గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈరోజు రైతు దగా దినోత్సవమని...రైతుల పంట బకాయిలు  వెంటనే చెల్లించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి..ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. మోటర్లకు మీటర్లు బిగించే పథకం రద్దుచేయ్యాలని నేతలు డిమాండ్ చేశారు. నది జలాల హక్కులను తాకట్టు పెట్టవద్దని, రైతులను దగా చెయ్యవద్దని టీడీపీ నేతలు నినాదాలు చేశారు. 

Updated Date - 2021-07-08T17:18:07+05:30 IST