రమ్య కుటుంబసభ్యులను పరామర్శించిన BJP leaders

ABN , First Publish Date - 2021-08-20T16:19:12+05:30 IST

ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబ సభ్యులను బీజేపీ నేతలు శుక్రవారం ఉదయం పరామర్శించారు.

రమ్య కుటుంబసభ్యులను పరామర్శించిన BJP leaders

గుంటూరు: ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబ సభ్యులను  బీజేపీ నేతలు శుక్రవారం ఉదయం పరామర్శించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ మాట్లాడుతూ రమ్య హత్య అత్యంత్య బాధాకరమన్నారు. జాతీయ ఎస్సీ కమీషన్‌కు ఈ ఘటన గురించి తెలియజేశామని, ఈ నెల 24 జాతీయ ఎస్సీ కమీషన్ ఈ ఘటనపై విచారణ చేయనుందని తెలిపారు. 


మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు మాట్లాడుతూ... డాక్టర్ సుధాకర్ ఘటన నుండి రమ్య హత్య వరకూ దళితులపై అనేక దాడులు జరిగాయన్నారు. నిందితులను చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ చట్టాన్నివైసీపీ, టీడీపీ స్వప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయటాన్ని బీజేపీ ఖండిస్తోందన్నారు. జాతీయ ఎస్సీ కమీషన్ రమ్య హత్యపై బహిరంగ విచారణ చేపడుతుందని చెప్పారు. ఇటువంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని అన్నారు. సరైనటువంటి పరిహారం ఇవ్వాలన్నారు. ఏ పార్టీ అయిన  రాజకీయ లబ్థి కోసం వాడుకుంటే బీజేపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. 

Updated Date - 2021-08-20T16:19:12+05:30 IST