Guntur: భార్యను మోసం చేసి రెండో వివాహం చేసుకున్న భర్త
ABN , First Publish Date - 2021-12-31T15:19:24+05:30 IST
జిల్లాలోని పిడుగురాళ్ళలో ఓ భర్త...కట్టుకున్న భార్యను మోసం చేసి రెండో వివాహాన్ని చేసుకున్నాడు.

గుంటూరు: జిల్లాలోని పిడుగురాళ్ళలో ఓ భర్త... కట్టుకున్న భార్యను మోసం చేసి రెండో వివాహాన్ని చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన మొదటి భార్య పోలీసులను ఆశ్రయించింది. తన భర్త తనను మోసం చేసి రెండో వివాహం చేసుకున్నాడని భార్య ఫర్వీన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త సైదా కొన్నేళ్లుగా రెండో భార్యతో కలిసి హైదరాబాద్లో ఉంటున్నాడు. భార్య ఫర్వీన్ వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని పోలీసులకు అప్పగించింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.