పల్నాడులో వరదలకు మరో వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-09-03T18:54:14+05:30 IST
జిల్లాలోని పల్నాడులో వరదలకు మరో వ్యక్తి మృతి చెందాడు.

గుంటూరు: జిల్లాలోని పల్నాడులో వరదలకు మరో వ్యక్తి మృతి చెందాడు. వెల్దుర్తి మండలంలో వాగు దాటుతూ తమావతు శ్రీను(40) మృతి చెందాడు. శ్రీరంపురంతండా - బోదలవీడు గ్రామాల మధ్యన ఉన్న ఉప్పలవాగులో శ్రీను కొట్టుకుపోయాడు. ఈ క్రమంలో ఈత కొడుతూ వాగు దాటే ప్రయత్నం చేసినప్పటికీ వరద ఉదృతికి నీటి మునిగి శ్రీను ప్రాణాలు కోల్పోయాడు. రెండు రోజుల క్రితం దాచేపల్లి మండలం కేసానపల్లి వద్ద వాగులో దుర్గి శ్రీనివాస రావు (40)గల్లంతైన విషయం తెలిసిందే. ఇప్పటికి అతని ఆచూకి ఇంకా లభించలేదు. మరోవైపు ఎగువ కురిస్తున్న వర్షాలకు వాగులు పొంగిపొర్లుతున్నాయి.