AP: మంగళగిరిలో బ్లేడ్ బ్యాచ్ హల్‌చల్
ABN , First Publish Date - 2021-09-03T16:34:59+05:30 IST
జిల్లాలోని మంగళగిరి గండాలయం పేటలో బ్లేడ్ బ్యాచ్ హల్‌చల్ చేసింది.

గుంటూరు: జిల్లాలోని మంగళగిరి గండాలయం పేటలో బ్లేడ్ బ్యాచ్ హల్‌చల్ చేసింది. అర్ధరాత్రి ఓ యువకుడిపై ఐదుగురు యువకులు దాడికి పాల్పడ్డారు. బ్లేడ్‌తో యువకుడిని గాయపరిచారు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని స్థానికులు ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.