Guntur: ఎర్రబాలెం గ్రామస్థుల వినూత్న నిరసన
ABN , First Publish Date - 2021-09-03T13:16:03+05:30 IST
జిల్లాలోని మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామస్థులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు.

గుంటూరు: జిల్లాలోని మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామస్థులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. గ్రామంలో గాడిదల బెడద ఎక్కువగా ఉందని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పంచాయతీ అధికారులు పట్టించుకోని పరిస్థితి నెలకొంది. దీంతో విసిగిపోయిన గ్రామస్థులు గాడిదను పంచాయతీ కార్యాలయంలో కట్టేసి తమ నిరసనను తెలియజేశారు.