క్వారీలో గల్లంతైన యువకుల మృతదేహాలు లభ్యం

ABN , First Publish Date - 2021-07-12T16:40:32+05:30 IST

జిల్లాలోని బొయపాలెం క్వారీ గుంతల్లో గల్లంతైన యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి.

క్వారీలో గల్లంతైన యువకుల మృతదేహాలు లభ్యం

గుంటూరు: జిల్లాలోని బొయపాలెం క్వారీ గుంతల్లో గల్లంతైన యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. నిన్న సాయంత్రం నలుగురు యువకులు బొయపాలెం క్వారీ గుంతల్లో గల్లంతయ్యారు. వారి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రాత్రి నుంచి గాలించగా ఉదయం యువకుల మృతదేహాలు లభించాయి. నలుగురు మృతదేహాలను జీజీహెచ్‌కు తరలించారు. మరోవైపు క్వారీ ఘటనపై హోంమంత్రి సుచరిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన యువకుల కుటుంబసభ్యులకు  హోంమంత్రి సుచరిత ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. 

Updated Date - 2021-07-12T16:40:32+05:30 IST