ప్రజలు చనిపోతున్నారనే ప్రచారం కరెక్ట్ కాదు: డాక్టర్ జయధీర్

ABN , First Publish Date - 2021-05-15T17:08:00+05:30 IST

కరోనా సెకండ్ వేవ్‌తో రాష్ట్రంలో ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం కన్వీనర్ డాక్టర్ జయధీర్ తెలిపారు.

ప్రజలు చనిపోతున్నారనే ప్రచారం కరెక్ట్ కాదు: డాక్టర్ జయధీర్

గుంటూరు: కరోనా సెకండ్ వేవ్‌తో  రాష్ట్రంలో ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం కన్వీనర్ డాక్టర్ జయధీర్ తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ప్రజలు చనిపోతున్నారని ప్రచారం చేయడం కరెక్ట్ కాదని.. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీలో 20% మాత్రమే కరోనా కేసులు నమోదు అవుతున్నాయని చెప్పారు. చాలా మంది పేషంట్లు ఆక్సిజన్ అవసరం లేకపోయినా వాటి కోసం  పాకులాడుతున్నారని అన్నారు.  ప్రస్తుతం 50% మందికి మాత్రమే ఆక్సిజన్ అవసరం అవుతుందని... కొంతమంది భయంతో ఆక్సిజన్ బెడ్స్ కోసం రికమండేషన్‌లు, పైరవీలు చేయిస్తే ప్రభుత్వానికి పిర్యాదు చేస్తామని హెచ్చరించారు. బెడ్స్ అవసరం లేకపోయినా వాటి కోసం ప్రయత్నాలు చేయవద్దన్నారు. ఇంటి వద్దే ఉండి వ్యాయామం చేస్తూ  మెడిసెన్స్ వాడుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రజలకు వైద్యం అందించకపోతే ప్రధానమంత్రికి పిర్యాదు చేస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి అంబులెన్స్‌లను ఆపే హక్కు లేదని డాక్టర్ జయధీర్ స్పష్టం చేశారు. 

Updated Date - 2021-05-15T17:08:00+05:30 IST