హోంమంత్రి సుచరిత నియోజకవర్గంలో పోలీసుల అత్యుత్సాహం

ABN , First Publish Date - 2021-02-05T14:31:02+05:30 IST

రాష్ట్ర హోంమంత్రి సుచరిత నియోజకవర్గంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థలకు ఎస్ఐ‌లు బెదిరింపులకు పాల్పడ్డారు.

హోంమంత్రి సుచరిత నియోజకవర్గంలో పోలీసుల అత్యుత్సాహం

గుంటూరు: రాష్ట్ర హోంమంత్రి  సుచరిత నియోజకవర్గంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థలకు ఎస్ఐ‌లు బెదిరింపులకు పాల్పడ్డారు. వట్టిచెరుకూరు మండలం కారంపూడిపాడు దళిత కాలనీలో టీడీపీ మద్దతు దారులను పోలీసులు బెదిరించారు. ఇంట్లో సోదాలు పేరుతో దళితులను ఎస్ఐ కృష్ణా రెడ్డి ఇబ్బందులకు గురి చేశారు. ఎన్నికలలో పోటీ చేస్తే తప్పుడు కేసులు పెడతానని బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఎస్‌ఐ వ్యవహారంపై జిల్లా కలెక్టర్‌కు బాధితులు ఫిర్యాదు చేశారు. దళితులకు రక్షణ కల్పించాలని మాజీ జెడ్పీటీసి ప్రసాద్ విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2021-02-05T14:31:02+05:30 IST