గుంటూరులో వైసీపీ కార్యకర్త వీరంగం
ABN , First Publish Date - 2021-02-01T16:46:31+05:30 IST
జిల్లాలోని క్రోసూరు మండలం గుడిపాడు గ్రామంలో వైసీపీ కార్యకర్త వీరంగం సృష్టించాడు.

గుంటూరు: జిల్లాలోని క్రోసూరు మండలం గుడిపాడు గ్రామంలో వైసీపీ కార్యకర్త వీరంగం సృష్టించాడు. కత్తితో హల్ చల్ చేస్తూ టీడీపీ కార్యకర్తపై దాడికి యత్నించాడు. వైసీపీ కార్యకర్త వీరంగంతో భయాందోళనకు గురైన స్థానికులు క్రోసూరు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకోవడంతో వివాదం సర్దుమణిగింది.