గుంటూరు: ఎన్టీఆర్ విగ్రహం వద్ద భోగి మంటల కార్యక్రమం

ABN , First Publish Date - 2021-01-13T15:37:36+05:30 IST

కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన రైతు , ప్రజా వ్యతిరేక జీవోలకు నిరసనగా మున్సిపల్ ఆఫీసు ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద భోగి మంటల కార్యక్రమం నిర్వహించారు.

గుంటూరు: ఎన్టీఆర్ విగ్రహం వద్ద భోగి మంటల కార్యక్రమం

గుంటూరు: కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన రైతు , ప్రజా వ్యతిరేక జీవోలకు నిరసనగా మున్సిపల్ ఆఫీసు ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద భోగి మంటల కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు  ఆదేశాల మేరకు నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఇటీవల కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన రైతు, ప్రజా వ్యతిరేక జోవో కాపీలను  భోగి మంటల్లో దగ్ధం చేసి నిరసన తెలిపారు.  ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-13T15:37:36+05:30 IST