గ్రావెల్ తవ్వకాలు నిలుపుదల
ABN , First Publish Date - 2021-12-31T05:58:34+05:30 IST
లాం కొండపై అక్రమంగా జరుగుతున్న గ్రావెల్ తవ్వకాలను రెవెన్యూ సిబ్బంది గురువారం నిలుపుదల చేశారు.

ఆంధ్రజ్యోతి కథనంతో స్పందించిన రెవెన్యూ సిబ్బంది
తాడికొండ, డిసెంబరు 30: లాం కొండపై అక్రమంగా జరుగుతున్న గ్రావెల్ తవ్వకాలను రెవెన్యూ సిబ్బంది గురువారం నిలుపుదల చేశారు. ‘గండి కొడుతున్నా...గంతలా.?’ అనే శీర్షికతో ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై అధికారులు స్పందించారు. తహసీల్దారు వైవీబీ కుటుంబరావు అదేశాలతో ఆర్‌ఐ మాధవి, వీఆర్‌వో గంగాధర్‌లు తవ్వకాలను నిలిపివేశారు. వేబిల్లులు లేకుండా గ్రావెల్‌ను తరలిస్తున్న ట్రాక్టర్‌ను సీజ్ చేశారు. అనుమతులు లేకుండా గ్రావెల్ తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.