పీఆర్‌సీ వెంటనే అమలు చేయాలి

ABN , First Publish Date - 2021-11-29T05:25:56+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగులందరికి పీఆర్‌సీని తక్షణమే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వాహనాల డ్రైవర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు వేంపాటి పాపారావు డిమాండ్‌ చేశారు.

పీఆర్‌సీ వెంటనే అమలు చేయాలి
సమావేశంలో ప్రసంగిస్తున్న సంఘం జిల్లా అధ్యక్షుడు పాపారావు

ప్రభుత్వ డ్రైవర్ల సంఘం డిమాండ్‌

గుంటూరు, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగులందరికి పీఆర్‌సీని తక్షణమే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వాహనాల డ్రైవర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు వేంపాటి పాపారావు డిమాండ్‌ చేశారు. ఆదివారం కలెక్టరేట్‌లోని అసోసియేషన్‌ కార్యాలయంలో ప్రభుత్వ డ్రైవర్లు సమావేశమై వివిధ అంశాలపై సమీక్షించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన పీఆర్‌సీ హామీని అమలు చేయకపోతుండటం వలన తమకు తీవ్ర నష్టం వాటిల్లుతోందన్నారు. అలానే కొత్త వాహనాలు కొనుగోలు చేయాలన్నారు. కాంట్రాక్టు డ్రైవర్లను పర్మినెంట్‌ చేయాలని కోరారు. ఆర్యోగం బాగోలేని డ్రైవర్లకు రూ.5 వేలు, ప్రమాదంలో చనిపోయిన వారికి రూ.15 వేలు, రిటైర్డ్‌ అయిన వారికి రూ.5 వేలు, కుమార్తెల వివాహాలకు రూ.5 వేలు ఆర్థికసాయం అందించేందుకు తీర్మానించామన్నారు. ఈ సమావేశంలో సంఘం అసోసియేట్‌ అధ్యక్షుడు గంగుల నారాయణ, ప్రధాన కార్యదర్శి మునిబాబు, కోశాధికారి బీసీహెచ్‌ నాగులు, గౌరవ అధ్యక్షుడు మొగిలి గురవయ్య, ఇతర నాయకులు కోటిరెడద్డి, మహబూబ్‌ సుభాని, ఏడుకొండలు, నరసింహానాయక్‌, మొహిద్దీన్‌, శంకర్‌, బాబురావు, భాస్కర్‌బాబు, ఏ కోటయ్య, కే నాగేశ్వరరావు పాల్గొన్నారు. 

  

Updated Date - 2021-11-29T05:25:56+05:30 IST