మిజోరం గవర్నర్‌కి పోలీసుల గౌరవవందనం
ABN , First Publish Date - 2021-10-30T04:46:36+05:30 IST
మిజోరం రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబుకు అర్బన్ పోలీసులు గౌరవవందనం సమర్పించారు.

గుంటూరు, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): మిజోరం రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబుకు అర్బన్ పోలీసులు గౌరవవందనం సమర్పించారు. శుక్రవారం సాయంత్రం నగరంలోని నవభారతనగర్‌లోని బంధువుల నివాసానికి గవర్నర్ హరిబాబు రాగా గుంటూరు ఆర్డీవో భాస్కర్‌రెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు, అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, తూర్పు తహసీల్దార్ శ్రీకాంత, డీఎస్పీ సుప్రజ పాల్గొన్నారు.