చెక్‌పోస్టుల వద్ద గంజాయి స్వాధీనం

ABN , First Publish Date - 2021-01-21T05:06:22+05:30 IST

కారులో గంజాయిని రాష్ట్ర సరిహద్దులు దాటిస్తుండగా పోలీసుల తనిఖీల్లో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

చెక్‌పోస్టుల వద్ద గంజాయి స్వాధీనం
పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి

దాచేపల్లి, జనవరి 20: కారులో గంజాయిని  రాష్ట్ర సరిహద్దులు దాటిస్తుండగా పోలీసుల తనిఖీల్లో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర సరిహద్దు తంగెడ గ్రామం వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా కారులో ప్రయాణిస్తున్న యువకుల ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో కారును ఆపి సోదాచేయగా గంజాయిను గుర్తించారు. ఈలోగా కారులోని యువకులు కారును వదిలి పరుగులు తీశారు. కారును, సరుకును పోలీసుస్టేషన్‌కు తరలించారు. మరో  చెక్‌పోస్టు పొందుగుల వద్ద కూడా పోలీసులు తనిఖీ నిమిత్తం కారును ఆపగా అందులోని వ్యక్తులు దురుసుగా వ్యవహరించారు. కారులో నిల్వచేసిన గంజాయిని, కారుని, వ్యక్తులను పోలీసుస్టేషన్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు. స్థానిక పోలీసు అధికారులు అందుబాటులో లేకపోవటంతో పట్టుబడిన గంజాయి ఎంతో తెలియరాలేదు.  


Updated Date - 2021-01-21T05:06:22+05:30 IST