జనసేన జిల్లా అధ్యక్షుడిగా గాదె వెంకటేశ్వరరావు

ABN , First Publish Date - 2021-07-08T05:49:41+05:30 IST

జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా గాదె వెంకటేశ్వరరావు నియమితులయ్యారు. బుధవారం మంగళగిరిలో జరిగిన పార్టీ రాష్ట్ర సమావేశంలో వివిధ జిల్లాలకు నూతన అధ్యక్షులను పార్టీ అధినేత పవన కల్యాణ్‌ నియమించారు.

జనసేన జిల్లా అధ్యక్షుడిగా గాదె వెంకటేశ్వరరావు
జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు

ప్రకటించిన  అధినేత పవన కల్యాణ్‌

రాష్ట్ర కార్యవర్గంలోనూ జిల్లాకు సముచిత స్థానం

గుంటూరు (మెడికల్‌) జూలై 7: జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా గాదె వెంకటేశ్వరరావు నియమితులయ్యారు. బుధవారం మంగళగిరిలో జరిగిన పార్టీ రాష్ట్ర సమావేశంలో వివిధ జిల్లాలకు నూతన అధ్యక్షులను పార్టీ అధినేత పవన కల్యాణ్‌ నియమించారు.  న్యాయవాది వృత్తిలో ఉన్న గాదె వెంకటేశ్వరరావు మొదటి నుంచి పార్టీలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఆయన జనసేన జిల్లా లీగల్‌ సెల్‌ కన్వీనర్‌గా ఉన్నారు. నిన్నటి వరకు పార్టీ పూర్తిస్థాయి అధ్యక్షుడు లేకపోవడంతో గుంటూరు పార్లమెంటరీ నియోజవర్గ ఇనచార్జిగా బోనబోయిన శ్రీనివాస్‌యాదవ్‌ జిల్లాలో పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షించేవారు. ఇకపై పూర్తిస్థాయిలో పార్టీ జిల్లా అధ్యక్షుడిగా గాదె వెంకటేశ్వరరావు పార్టీ వ్యవహరాలు నడిపించనున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన వెంకటేశ్వరరావును పలువురు పార్టీ నేతలు అభినందించారు. ఈ సందర్భంగా బుధవారం రాత్రి గాదె వెంకటేశ్వరరావు ఫోనలో ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా తనను నియమించిన పవన కల్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో పార్టీని మరింత పటిష్టవంతం చేసేందుకు తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. త్వరలో పార్టీ జిల్లా నూతన కార్యవర్గం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తానని వెంకటేశ్వరరావు తెలిపారు. ఇది ఇలా ఉంటే రాష్ట్ర కార్యవర్గంలో జిల్లాకు చెందిన పలువురు నేతలకు స్ధానం దక్కింది. ఇప్పటి వరకు గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ ఇనచార్జిగా ఉన్న బోనబోయిన శ్రీనివాస్‌ యాదవ్‌ను జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. రాష్ట్ర కార్యదర్శులుగా వడ్రాణం మార్కాండేయబాబు, షేక్‌ నాయబ్‌కమాల్‌, సయ్యద్‌ జిలానీ ఎన్నికయ్యారు. సంయుక్త కార్యదర్శిగా బండారు రవికాంత ఎన్నికయ్యారు. కీలకమైన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల సమన్వయకర్తగా కళ్యాం శివ శ్రీనివాస్‌(కేకే) ఎన్నికయ్యారు. పార్టీ అనుబంధ సంస్థ  చేనేత వికాస విభాగానికి చైర్మనగా మంగళగిరికి చెందిన చిల్లపల్లి శ్రీనివాస్‌ను నియమించారు. 

Updated Date - 2021-07-08T05:49:41+05:30 IST