మూడుసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోరా?

ABN , First Publish Date - 2021-08-26T05:26:20+05:30 IST

పంటల బీమా నిధుల స్వాహాపై కలెక్టర్‌, జేడీ, మంత్రి, కమిషనర్‌లకు మూడుసార్లు ఫిర్యాదు చేశాం.. అయినా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని వట్టిచెరుకూరు మండలం కారంపూడిపాడు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మూడుసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోరా?
అధికారులతో మాట్లాడుతున్న కారంపూడిపాడు గ్రామస్తులు

బీమా నిధుల స్వాహాపై రైతుల ఆగ్రహం

గుంటూరు, వట్టిచెరుకూరు, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): పంటల బీమా నిధుల స్వాహాపై కలెక్టర్‌, జేడీ, మంత్రి, కమిషనర్‌లకు మూడుసార్లు ఫిర్యాదు చేశాం.. అయినా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని వట్టిచెరుకూరు మండలం కారంపూడిపాడు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యాలయంలో బుధవారం సర్పంచ చందు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గుంటూరు ఏడీ శ్రీనివాసరావు, ఏంఎవో లక్ష్మిని  కలిసి మాట్లాడారు. రైతులు తోటకూర రత్తయ్య, వెంకటస్వామి, శంకరరావు, శివయ్య తదితరులు పాల్గొన్నారు. స్వాహా సొమ్మును రికవరిచేస్తామని ఏడీ శ్రీనివాసరావు తెలిపారు. 


Updated Date - 2021-08-26T05:26:20+05:30 IST