కౌలు రైతు ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-10-30T04:43:58+05:30 IST

మండలంలోని చిర్రావూరు గ్రామానికి చెందిన కౌలు రైతు మేడూరి లక్ష్మీనారాయణ(37) గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు.

కౌలు రైతు ఆత్మహత్య
లక్ష్మీనారాయణ మృతదేహం

తాడేపల్లి, అక్టోబరు 29:  మండలంలోని చిర్రావూరు గ్రామానికి చెందిన కౌలు రైతు మేడూరి లక్ష్మీనారాయణ(37) గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. సుమారు 20 ఎకరాలు కౌలు చేస్తున్న లక్ష్మీనారాయణ అప్పుల భారంతో తాను కౌలు చేస్తున్న పొలంలో పురుగుమందు తాగాడు. 20 ఎకరాలలో పది ఎకరాలు మాగాణి,  నాలుగు ఎకరాలు మినుము, మూడు ఎకరాలు అరటి, రెండు ఎకరాలు కంద, ఎకరంలో పసుపు సాగు చేశాడు. వ్యవసాయంలో నష్టం రావడంతో మూడేళ్లలో రూ.70 లక్షల అప్పులు పెరిగిపోవడంతో ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. లక్ష్మీనారాయణకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. స్థానిక నాయకులు ఆయన కుటుంబాన్ని పరామర్శించి,  ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.  


Updated Date - 2021-10-30T04:43:58+05:30 IST