సీఎం జగన్ మాటలు ప్రకటనలకే పరిమితం: ఆలపాటి రాజా

ABN , First Publish Date - 2021-03-22T19:19:57+05:30 IST

పంట నష్టపోయిన రైతులను పట్టించుకునే నాధుడు లేడని మాజీ మంత్రి ఆలపాటి రాజా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం జగన్ మాటలు ప్రకటనలకే పరిమితం: ఆలపాటి రాజా

గుంటూరు: పంట నష్టపోయిన రైతులను పట్టించుకునే నాధుడు లేడని మాజీ మంత్రి ఆలపాటి రాజా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ ఎక్కడ పని చేస్తుందో అర్థం కావడం లేదన్నారు. నాలుగు గోడలు మధ్య సీఎం జగన్ మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయని విమర్శించారు. వ్యవసాయం మూలిగే నక్క మీద తాటికాయ పడిన మాదిరిగా ఉందన్నారు. నష్టాలతో రైతు కుటుంబాలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. ప్రతిపక్ష నేతల మీద పెట్టే అక్రమ కేసుల మీద ఉన్న శ్రద్ద రైతుల మీద లేదని మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతాంగాన్ని ఆదుకోవాలని ఆలపాటి రాజా డిమాండ్ చేశారు.

Updated Date - 2021-03-22T19:19:57+05:30 IST