వాగులో పడి వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-09-04T05:13:49+05:30 IST
మండలంలోని శ్రీరాంపురంతండా- బోదలవీడు మధ్యలో ఉన్న ఉప్పలవాగులో పడి రైతు మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది.

వెల్దుర్తి, సెప్టెంబరు 3: మండలంలోని శ్రీరాంపురంతండా- బోదలవీడు మధ్యలో ఉన్న ఉప్పలవాగులో పడి రైతు మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీరాంపురంతండాకు చెందిన రమావత శ్రీనునాయక్(40) పొలానికి ఎరువులు తెచ్చేందుకు బోదలవీడు బయలుదేరాడు. మార్గమధ్యంలోని ఉప్పలవాగులో కాలినడకన దాటుతూ ప్రమాదవశాత్తూ వాగు ఉధృతికి కొట్టుకుపోయాడు. పోలీసులు చేరుకుని గాలించగా చెట్లకొమ్మలకు మృతదేహం చిక్కుకుని లభ్యమైంది. దానిని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం మాచర్ల పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. శ్రీనునాయక్‌కు భార్య కాంతిబాయి, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.