7,771 మంది మత్స్యకారులకు లబ్ధి

ABN , First Publish Date - 2021-05-18T05:30:00+05:30 IST

చేపల వేటపై నిషేధం ఉనన సమయంలో ఉపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలను ఆదుకొనేందుకు వైఎస్‌ఆర్‌ మత్స్యకార భరోస పథకాన్ని వరుసగా మూడో ఏడాది అమలు చేస్తున్నామని సీఎం జగన్‌ అన్నారు.

7,771 మంది మత్స్యకారులకు లబ్ధి
మత్స్యకార భరోసా చెక్కు విడుదల చేసి లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్న ఉప సభాపతి కోన రఘుపతి

గుంటూరు, మే 18 (ఆంధ్రజ్యోతి): చేపల వేటపై నిషేధం ఉనన సమయంలో ఉపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలను ఆదుకొనేందుకు వైఎస్‌ఆర్‌ మత్స్యకార భరోస పథకాన్ని వరుసగా మూడో ఏడాది అమలు చేస్తున్నామని సీఎం జగన్‌ అన్నారు.  మంగళవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన మూడో ఏడాది వైఎస్‌ఆర్‌ మత్స్యకార భరోసా పథకం నిధులను విడుదల చేశారు.  ఈ పథకం కింద జిల్లాలో 7,771 మందికి లబ్ధి జరుగుతుందని జాయింట్‌ కలెక్టర్‌(రెవెన్యూ) ఏఎస్‌ దినేష్‌కుమార్‌ తెలిపారు. జిల్లాలో మొత్తం 191 యాంత్రిక నావలు, 1,546 మోటార్‌ పడవలు, 77 నాన్‌ మోటారు పడవలతో చేపల వేట చేస్తూ జీవనోపాధి పొందుతున్న వారికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.7.77 కోట్ల ఆర్థికసాయం అందుతుందన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో ఆక్వాహబ్‌లలో నూతనంగా నియమించిన సాగర్‌ మిత్రలకు శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి నియామకపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జేసీ(ఆసర) కె.శ్రీధర్‌రెడ్డి, ట్రైనీ కలెక్టర్‌ శుభం బన్సల్‌, పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, డీఆర్‌వో కొండయ్య, మత్స్య శాఖ డీడీ సురేష్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-18T05:30:00+05:30 IST