కారులో.. మంటలు

ABN , First Publish Date - 2021-08-20T05:31:45+05:30 IST

జిన్నాటవర్‌ సెంటర్‌లో సాయంత్రం రద్దీగా ఉన్న సమయంలో టాటా ఇండికా(ఏపీ36జె 3699) కారులో నుంచి హఠాత్తుగా మంటలు వ్యాపించాయి.

కారులో.. మంటలు
కారులో నుంచి వస్తున్న పొగ

గుంటూరు, ఆగస్టు 19: జిన్నాటవర్‌ సెంటర్‌లో సాయంత్రం రద్దీగా ఉన్న సమయంలో టాటా ఇండికా(ఏపీ36జె 3699) కారులో నుంచి హఠాత్తుగా మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా మంటలతో పాటు పొగల రావడంతో కారును రోడ్డుపైనే ఆపి దిగిపోయారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. దట్టమైన పొగలు వ్యాపించటంతో అటుగా రాకపోకలు సాగించే పాదచారులు, వాహన చోదకులు తీవ్ర భయాందోళకు గురయ్యారు. ఒక దశలో కారు పేలుతుందేమోనని స్థానికులు దూరంగా పరుగులు పెట్టారు. సమాచారం తెలుసుకున్న ట్రాఫిక్‌ పోలీసులు అప్రమత్తమై  ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.  

 


Updated Date - 2021-08-20T05:31:45+05:30 IST