BlackRice: ప్రయోగాత్మకంగా.. బ్లాక్‌రైస్‌

ABN , First Publish Date - 2021-07-12T14:59:47+05:30 IST

బ్లాక్‌రైస్‌ సాగుకు వ్యవసాయ శాఖ..

BlackRice: ప్రయోగాత్మకంగా.. బ్లాక్‌రైస్‌

40 మంది రైతులతో మోడల్‌ ప్లాంట్లు

మినీ కిట్ల రూపంలో విత్తనాలు అందజేత

పోషకవిలువలు కలిగిన ధాన్యంగా గుర్తింపు 

ముంపు ప్రాంతాల్లో అనువైన వంగడం


(గుంటూరు - ఆంధ్రజ్యోతి): బ్లాక్‌రైస్‌ సాగుకు వ్యవసాయ శాఖ ప్రోత్సాహిన్నిస్తోంది. లాం వ్యవవసాయ పరిశోధనా కేంద్రం బాపట్లసంస్థ తయారుచేసిన బ్లాక్‌రైస్‌- 2841 బీపీటీ అనే రకాన్ని మినీకిట్ల రూపంలో రైతులకు ఉచితంగా అందజేయనున్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యప్రదాయిని, మంచి ఆహారపోషక విలువలు కలిగిన కాలిపట్టు అనే బ్లాక్‌రైస్‌ను శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేసి తయారుచేశారు. ఇది ముంపు ప్రాంతాల్లో సేద్యానికి అనువైన వంగడం అని రైతులు చెబుతున్నారు. వివిధ రాష్ట్రాల్లో మంచి డిమాండ్‌ ఉన్న ఈ బ్లాక్‌రైస్‌ను అమలాపురం రూరల్‌ మండలం నల్లమిల్లి శివారు అప్పారివారిపాలెం గ్రామానికి చెందిన ఆదర్శరైతు అప్పారి వెంకటరమణ ప్రయోగాత్మకంగా ఉత్ప త్తి చేశారు. తెలంగాణా ప్రాంతంలోని దేశవాళీ రకమైన కాలిపట్టి విత్తనాలను ఇటీవల దాళ్వాలో సాగుచేశారు. సాధా రణ వరిరకంతో పోలిస్తే బ్లాక్‌రైస్‌ వరికంకులు ఐదు నుంచి ఆరడుగులు ఎత్తుకు ఎదుగుతాయి. ఈ పంట 150 రోజులకు ఉత్పత్తి దశకు చేరుతుంది. ఎరువులు, పురుగుమందులు లేకుండా ప్రకృతి సేద్యం ఆధారంగానే బ్లాక్‌రైస్‌ ఉత్పత్తి అవుతుందని అధికారులు తెలిపారు.

  

40 మినీ కిట్లు పంపిణీకి సిద్ధం

ఈ ఏడాది ఖరీఫ్‌లో జిల్లాలో బ్లాక్‌రైస్‌-2841 బీపీటీ అనేరకం వరివిత్తనాలను 40 మినీకిట్లను రైతులకు అందజేస్తున్నారు. ఆదర్శ రైతులతో దీనిని సాగుచేయబోతున్నారు. ఒక్కో కిట్‌లో రెండుకిలోల వరి విత్తనాలుంటాయి. జిల్లాలోని 12 వ్యవసాయ డివిజన్‌లలో రైతులను ఎంపికచేసి మోడల్‌గా సాగుచేస్తారు. ఈ ప్లాంట్‌లను వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు నిత్యం పరిశీలిస్తుంటారని వ్యవసాయశాఖ జేడీ విజయభారతి తెలిపారు.

Updated Date - 2021-07-12T14:59:47+05:30 IST