పతనావస్థకు వైసీపీ ప్రభుత్వం
ABN , First Publish Date - 2021-10-20T05:47:36+05:30 IST
వైసీపీ నాయకుల విధ్వంసం చూస్తుంటే ఈ ప్రభుత్వం పత నావస్థకు ఎంత దగ్గరగా ఉందో అర్థమవుతుందని మాజీ శాసనసభ్యుడు యపతినేని శ్రీనివాసరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

యరపతినేని శ్రీనివాసరావు
పిడుగురాళ్ల, అక్టోబరు19: వైసీపీ నాయకుల విధ్వంసం చూస్తుంటే ఈ ప్రభుత్వం పత నావస్థకు ఎంత దగ్గరగా ఉందో అర్థమవుతుందని మాజీ శాసనసభ్యుడు యపతినేని శ్రీనివాసరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అరాచక, అవినీతి, ఫ్యాక్షనిస్టు పరిపాలన ఏ విధంగా జరుగుతుందో ఈ ఘటనలకి నిదర్శనమని అన్నారు. డీజీపీ ఆఫీస్ పక్కనే ఉన్నప్పటికీ రాష్ట్ర తేదేపా కార్యాలయంపై వందలాది వైసీపీ మూకలు దాడి చేస్తుంటే చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. డీజీపీని వెంటనే పదవి నుంచి తప్పించాలని, రాష్ట్రపతి పాలన పెట్టి మొత్తం లాఅండ్ ఆర్డర్‌ను కేంద్రం కంట్రోల్లోకి తీసుకోవాలని కోరారు. గంజాయి, మాదక ద్రవ్యాలు, అక్రమమైనింగ్, లిక్కర్‌తో రాష్ర్టాన్ని వైసీపీ ష్ర్టుపట్టించిందన్నారు. వైసీపీ ఎన్ని దాడులు చేసినా పార్టీ శ్రేణులెవ్వరూ భయపడరన్నారు. రాష్ట్రప్రభుత్వాన్ని తక్షణమే బర్తరఫ్‌చేసి రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ ఫ్యాక్షనిస్టు ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రజలు బుద్ధి చెప్పి గద్దె దింపేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.