పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ రద్దు ఎప్పుడు?

ABN , First Publish Date - 2021-08-27T05:50:13+05:30 IST

అధికారంలోకి వస్తే పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ పూర్తిగా రద్దు చేస్తామని ప్రగల్బాలు పలికిన జగనరెడ్డి అధికారంలోకి వచ్చాక ఆ హామీ మరిచారని టీడీపీ గుంటూరు పార్లమెంటరీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌ ప్రశ్నించారు.

పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ రద్దు ఎప్పుడు?
తెనాలి శ్రావణ్‌ కుమార్‌

గుంటూరు, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): అధికారంలోకి వస్తే పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ పూర్తిగా రద్దు చేస్తామని ప్రగల్బాలు పలికిన జగనరెడ్డి అధికారంలోకి వచ్చాక ఆ హామీ మరిచారని టీడీపీ గుంటూరు పార్లమెంటరీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌ ప్రశ్నించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ  ప్రజలు కరోనా కష్టాల్లో ఉంటే డెవలప్‌మెంట్‌, రోడ్‌ సెస్‌ పేరుతో చీకటి జీవోలిచ్చి అడ్డగోలుగా పెట్రో ధరలు పెంచారన్నారు.   2020 డిసెంబరు నాటికి రూ.681 ఉన్న గ్యాస్‌ సిలెండర్‌ ధర ఇప్పుడు ఏకంగా 900కి చేరి ప్రజలను భయపెడుతుందన్నారు.  ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే ఏకంగా 4 సార్లు ధరలు పెంచారాన్నారు.  చంద్రబాబు ఆదేశాల మేరకు పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను తగ్గించాలని శనివారం నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు శ్రావణ్‌కుమార్‌ తెలిపారు. 


Updated Date - 2021-08-27T05:50:13+05:30 IST