దళిత ద్రోహి జగన్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-08-03T05:34:57+05:30 IST

ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులు దారి మళ్లించడం దుర్మార్గమని, అందుకు దళిత ద్రోహిగా సీఎం జగన్‌రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని టీడీపీ గుంటూరు పార్లమెంటు అధ్యక్షుడు, తాడికొండ మాజీఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ పేర్కొన్నారు.

దళిత ద్రోహి జగన్‌రెడ్డి
తెనాలి శ్రావణ్‌ కుమార్‌

ఎస్సీ సబ్‌ ప్లాన్‌ నిధుల మళ్లింపు దుర్మార్గం

మాజీ ఎమ్మెల్యే  శ్రావణ్‌కుమార్‌

గుంటూరు, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులు దారి మళ్లించడం దుర్మార్గమని, అందుకు దళిత ద్రోహిగా సీఎం జగన్‌రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని టీడీపీ గుంటూరు పార్లమెంటు అధ్యక్షుడు, తాడికొండ మాజీఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ పేర్కొన్నారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ రుణాలను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంటే, ఆ పార్టీ దళితనేతలు ఎందుకు నోరుమెదపటం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో ఎస్సీలకు ఇన్నోవాకార్లు ఇచ్చి ఓనర్లను చేస్తే జగన్‌రెడ్డి వాటన్నింటిని రద్దుచేసి వారిని రోడ్డుపాల్జేశారన్నారు. మరోపక్క అంబేద్కర్‌ విగ్రహాల ధ్వంసం... దళితులపై దాడులు వంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. శిరోముండనాలు చేస్తున్నా ఎందుకు వైసీపీ నేతలు మాట్లాడటం లేదని నిలదీశారు. రాష్ట్రానికి మణిహారంలా నిలిచే  రాజధాని అమరావతిని నాశనం చేసిన ఘనత జగన్‌ రెడ్డిదేనన్నారు. రాజధానిలో అంబేద్కర్‌ స్మృతివనం లేకుండా చేశారని పేర్కొన్నారు. ఉపముఖ్యమంత్రులను ఉత్సవ విగ్రహాల్లా మార్చి... కీలక పదవులు జగన్‌రెడ్డి వర్గానికి కట్టుబెట్టుకున్నారని ఆరోపించారు.  


Updated Date - 2021-08-03T05:34:57+05:30 IST