ధరల పెంపుతో బతుకే భారం
ABN , First Publish Date - 2021-09-03T06:27:16+05:30 IST
కరోనాతో అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే పెట్రోల్, డీజిల్, ఆస్తిపన్ను, చెత్తపన్ను, నిత్యావసరాల ధరలు పెంచుతూ వైసీపీ ప్రభుత్వం బతుకే భారంగా మార్చిందని టీడీపీ గుంటూరు పార్లమెంటరీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్ తెలిపారు.

గుంటూరు, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): కరోనాతో అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే పెట్రోల్, డీజిల్, ఆస్తిపన్ను, చెత్తపన్ను, నిత్యావసరాల ధరలు పెంచుతూ వైసీపీ ప్రభుత్వం బతుకే భారంగా మార్చిందని టీడీపీ గుంటూరు పార్లమెంటరీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్ తెలిపారు. గురువారం ఆయన పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ విద్యుత చార్జీలను పెంచి ప్రజలపై సీఎం జగన మోయలేని భారం మోపారన్నారు. వైసీపీ నేతల లూటీకి, దుబారాకు విద్యుత వినియోగదారులు మోయలేని భారం మోయాలా అని ప్రశ్నించారు. జగన రెండున్నరేళ్ల పాలనలో పెంచిన విద్యుత ఉత్పత్తి సామర్థ్యము సున్నా అని తెలిపారు.