పెట్రో ధరలను వెంటనే తగ్గించాలి
ABN , First Publish Date - 2021-07-08T06:26:21+05:30 IST
కరోనా కష్టకాలంలో సామాన్యులపై పెనుభారంగా మారిన పెట్రో ధరలను వెంటనే తగ్గించాలని మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు డిమాండ్ చేశారు.

మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి
గుంటూరు, జూలై 7: కరోనా కష్టకాలంలో సామాన్యులపై పెనుభారంగా మారిన పెట్రో ధరలను వెంటనే తగ్గించాలని మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు డిమాండ్ చేశారు. పెట్రో ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ వినియోగదారుల నుంచి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ట్రావెలర్స్ బంగ్లా సెంటర్‌లోని పెట్రోల్ బంకు ఎదుట నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న ధరలను అదుపు చేయటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ధ్వజమెత్తారు. ఏపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు కొరివి వినయ్‌కుమార్ మాట్లాడుతూ పెట్రో ధరలు పెంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్ని నిలువునా దోచుకుంటున్నాయని మండిపడ్డారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అడవి ఆంజనేయులు, బొట్ల బ్రహ్మం, రాము, కేకే గుప్తా, నాగమల్లేశ్వరరావు, శ్రీను, మద్ది శ్రీనివాస్ తదితరులున్నారు.