వృద్ధులను మోసం చేశారు
ABN , First Publish Date - 2021-09-04T05:14:33+05:30 IST
తాము అధికారంలోకి రాగానే వృద్ధులకు రూ.మూడు వేల పింఛన ఇస్తానని చెప్పిన జగన తర్వాత మాటతప్పి మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కొమ్మాలపాటి శ్రీధర్ ఆరోపించారు.

మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్
అచ్చంపేట, సెప్టెంబరు3: తాము అధికారంలోకి రాగానే వృద్ధులకు రూ.మూడు వేల పింఛన ఇస్తానని చెప్పిన జగన తర్వాత మాటతప్పి మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కొమ్మాలపాటి శ్రీధర్ ఆరోపించారు. ఆయన శుక్రవారం ఓ ప్రకటన చేశారు. వృద్ధుల పింఛనలలో మిగులు పద్ధతిని అనుసరించటం సరైన విధానం కాదన్నారు. పింఛన్ల భారం తగ్గించుకోవటానికి ప్రతినెలా కొత్త నిబంధనలు తీసుకొస్తున్నారని విమర్శించారు. అనేకమంది కూలీలు వ్యవసాయ, కూలీ పనుల కోసం వలస వెళ్లి పట్టణాల్లో పిల్లల వద్ద ఉన్నారని, వీరి పింఛనలు తొలగించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రూ.35తో పింఛనలు ప్రవేశ పెట్టారని, చంద్రబాబు నాయుడు పెంచుకుంటూ పోతూ రూ.2వేలకు ఫింఛనలు తెచ్చారని, ఇది తెలుగుదేశం పార్టీకే చెల్లిందన్నారు. జగనమోహనరెడ్డి ఇచ్చిన హామీ నెరవేర్చి పింఛన్ల నగదును పెంచాలని డిమాండ్ చేశారు.