సురక్షితంగానే ఉన్నా..: ప్రత్తిపాటి

ABN , First Publish Date - 2021-02-08T05:42:41+05:30 IST

తాను సురక్షితంగానే ఉన్నానని.. ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు.

సురక్షితంగానే ఉన్నా..: ప్రత్తిపాటి
చిలకలూరిపేటలోని తన నివాసగృహంలో మాట్లాడుతున్న మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

చిలకలూరిపేట, ఫిబ్రవరి 7: తాను సురక్షితంగానే ఉన్నానని.. ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. నరసరావుపేట- చిలకలూరిపేట మార్గంలో కనపర్రు సమీపంలోని పెట్రోలు బంకులో సమీపంలో రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ సమయంలో ప్రత్తిపాటి హైదరాబాద్‌ నుంచి చిలకలూరిపేటకు వస్తున్నారు. ఈ క్రమంలో ఓ ద్విచవ్రాహనం ప్రత్తిపాటి కారుకు తగిలింది. అయితే తృటిలో ప్రత్తిపాటికి ప్రమాదం తప్పిందని సోషల్‌ మీడియాలో ప్రచారం కావడంతో ప్రత్తిపాటి స్పందించారు. తనకు, తన కారుకు కానీ ఎటువంటి ప్రమాదం జరగలేదన్నారు.  


Updated Date - 2021-02-08T05:42:41+05:30 IST