ఇంత దిగజారుడు రాజకీయమా..?
ABN , First Publish Date - 2021-08-26T05:24:32+05:30 IST
రాష్ట్రంలో జగన సీఎం అయినప్పటి నుంచి బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవం దెబ్బతింటోందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు విమర్శించారు.

నక్కా ఆనందబాబు
గుంటూరు, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జగన సీఎం అయినప్పటి నుంచి బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవం దెబ్బతింటోందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు విమర్శించారు. బుధవారం ఆయన గుంటూరులోని తన కార్యాలయం నుంచి అనలైనలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. దళిత జాతిని అడ్డం పెట్టుకుని వారితో పనిమాలిన వ్యాఖ్యలు చేయిస్తూ జగనమోహనరెడ్డి నీచ రాజకీయానికి దిగారని మండిపడ్డారు. టీడీపీకి రెండు సీట్లు కూడా రావు.. వస్తే చంద్రబాబు ఇంటిలో పాకి పనిచేస్తానని డిప్యూటీ సీఎం నారాయణస్వామి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపడుతున్నామన్నారు. అసలు నారయణస్వామితో పాకీపని చేయించాలనే ఆలోచన సీఎంకు ఎందుకు వచ్చిందో అంటూ ఎద్దేవా చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే దళిత జాతి క్షమించదని ఆనందబాబు అన్నారు.