దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-12-19T05:41:08+05:30 IST

అర్చకులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏపీ అర్చక జేఏసీ నాయకులు దేవదాయ కమిషనర్‌ ఎం.హరిజవహర్‌లాల్‌ను కోరారు.

దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలి
దేవదాయ శాఖ కమిషనర్‌ హరిజవహర్‌లాల్‌కు వినతిపత్రం అందజేస్తున్న ఏపీ అర్చక జేఏసీ నాయకులు

దేవదాయ శాఖ కమిషనర్‌కు ఏపీ అర్చక జేఏసీ వినతి

గుంటూరు(కార్పొరేషన్‌), డిసెంబరు 18: అర్చకులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏపీ అర్చక జేఏసీ నాయకులు దేవదాయ కమిషనర్‌ ఎం.హరిజవహర్‌లాల్‌ను కోరారు. ఈ మేరకు పలు డిమాండ్లతో కూడిన వినతపత్రాన్ని శనివారం వారు గొల్లపూడిలోని కార్యాలయంలో ఆయనకు అందజేశారు. జేఏసీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మూరమళ్ల రాంబాబు మాట్లాడుతూ 43/10 రిజిష్టర్‌లో అర్చకుల పేర్లు నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. వేతన అర్చకులకు స్పెషల్‌ ఫండ్‌ ఏర్పాటు చేయాలని, వెల్ఫేర్‌ సమస్య పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.శేషాచార్యులు, కార్యనిర్వాహక కార్యదర్శులు జంధ్యాల వెంకట రామలింగేశ్వరశాస్ర్తి, కొత్తలంక మురళీకృష్ణ, నాయకులు రొంపిచర్ల శేషాచార్యులు, రామకృష్ణాచార్యులు, అనిల్‌కుమార్‌, జగన్మోహన్‌, రవికుమార్‌, ఆంజనేయులు, ఫణికుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-12-19T05:41:08+05:30 IST