రక్షత నీటికి అంతరాయం లేకుండా వేసవిలో విద్యుత్‌

ABN , First Publish Date - 2021-02-06T05:15:14+05:30 IST

రానున్న వేసవిలో రక్షిత, గ్రామీణ నీటి సరఫరా సర్వీసులకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకొంటున్నట్లు విద్యుత్‌ ఆపరేషన్‌ ఎస్‌ఈ విజయకుమార్‌ తెలిపారు.

రక్షత నీటికి అంతరాయం లేకుండా వేసవిలో విద్యుత్‌
అధికారులతో సమీక్షిస్తున్న ఎస్‌ఈ విజయకుమార్‌ తదితరులు

గుంటూరు, ఫిబ్రవరి 5: రానున్న వేసవిలో రక్షిత, గ్రామీణ నీటి సరఫరా సర్వీసులకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకొంటున్నట్లు విద్యుత్‌ ఆపరేషన్‌ ఎస్‌ఈ  విజయకుమార్‌ తెలిపారు. గుంటూరులోని విద్యుత్‌భవన్‌లో శుక్రవారం జరిగిన సమీక్షలో ఆయన ప్రసంగించారు. గ్రామీణ రక్షిత నీటి సరఫరా కోసం ఇప్పటికే విద్యుత్‌శాఖాపరంగా సామగ్రి అందుబాటులో ఉంచామన్నారు. వివిధ స్థాయిల్లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించామన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు కూడా విద్యుత్‌ సిబ్బందితో సమన్వయంతో పనిచేయాలన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ నుంచి విద్యుత్‌శాఖకు రావాల్సిన బకాయిలను సకాలంలో చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ సురేష్‌, విద్యుత్‌ అధికారులు వెంకటేశ్వర్లు, పీవీఆర్‌ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-02-06T05:15:14+05:30 IST