విద్యా, వసతి దీవెన కోసం నమోదు చేసుకోవాలి
ABN , First Publish Date - 2021-11-21T05:49:38+05:30 IST
జిల్లాలో 2021-22 విద్యా సంవత్సరాల్లో మొదటి సంవత్సరం(ఫ్రెష్) డిగ్రీ, వృత్తి విద్యా కోర్సులు చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనార్టీ, దివ్యాంగులు డిసెంబరు 5లోగా ఉపకార వేతనాల కోసం జ్ఞానభూమి పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ డి.మధుసూదనరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

గుంటూరు(విద్య), నవంబరు 20: జిల్లాలో 2021-22 విద్యా సంవత్సరాల్లో మొదటి సంవత్సరం(ఫ్రెష్) డిగ్రీ, వృత్తి విద్యా కోర్సులు చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనార్టీ, దివ్యాంగులు డిసెంబరు 5లోగా ఉపకార వేతనాల కోసం జ్ఞానభూమి పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ డి.మధుసూదనరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకోసం జిల్లాలో కళాశాలల ప్రిన్సిపాల్స్, కళాశాలల యాజమాన్యాలు ఏర్పాట్లు చేయాలని సూచించారు.