మెడికల్ కళాశాలకు.. రూ.475 కోట్లకు పరిపాలన ఆమోదం
ABN , First Publish Date - 2021-03-24T05:42:37+05:30 IST
బాపట్లలో మెడికల్ కళాశాలతోపాటు నర్సింగ్ కళాశాల, 500పడకల ఆసుపత్రి నిర్మాణాలకు రూ.475కోట్ల పరిపాలన ఆమోదం లభించినట్లు డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి తెలిపారు.

డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి
బాపట్ల, మార్చి 23 : బాపట్లలో మెడికల్ కళాశాలతోపాటు నర్సింగ్ కళాశాల, 500పడకల ఆసుపత్రి నిర్మాణాలకు రూ.475కోట్ల పరిపాలన ఆమోదం లభించినట్లు డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి తెలిపారు. మంగళవారం బాపట్లలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పది రోజుల్లో దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తవుతుందన్నారు. అత్యాధునికంగా నిర్మాణాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 16 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు చొరవ తీసుకొని మంజూరు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.