డీవీసీలో నేడు అత్యాధునిక వైద్యసేవలు ప్రారంభం

ABN , First Publish Date - 2021-08-28T04:12:34+05:30 IST

వడ్లమూడి డీవీసీ హాస్పటల్‌లోని రీసెర్చ్‌ సెంటర్‌లో తృతీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని అత్యాధునిక హార్ట్‌ సెంటర్‌, అధునాతన క్యాథ్‌ల్యాబ్‌ను ప్రారంభించనున్నట్లు సంగం డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ళ నరేంద్రకుమార్‌ తెలిపారు.

డీవీసీలో నేడు అత్యాధునిక వైద్యసేవలు ప్రారంభం
సమావేశంలో మాట్లాడుతున్న సంగం డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్‌

హార్ట్‌సెంటర్‌, క్యాథ్‌ల్యాబ్‌ను ప్రారంభించనున్న చినజీయరు స్వామి 

చేబ్రోలు, ఆగస్టు27: వడ్లమూడి డీవీసీ హాస్పటల్‌లోని రీసెర్చ్‌ సెంటర్‌లో తృతీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని అత్యాధునిక హార్ట్‌ సెంటర్‌, అధునాతన క్యాథ్‌ల్యాబ్‌ను ప్రారంభించనున్నట్లు సంగం డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ళ నరేంద్రకుమార్‌ తెలిపారు. శనివారం శ్రీశ్రీశ్రీ త్రిదిండి చిన జీయర్‌ స్వామి ఈ సేవలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం హాస్పటల్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు హాస్పటల్‌ ద్వారా 70,000 మందికి ఔట్‌పేషెంట్‌ సేవలను అందించామన్నారు. జిల్లాలో 63 వైద్య శిబిరాల ద్వారా 23,000 మందికి ఉచిత వైద్య పరీక్షలు చేయటంతోపాటు, మందులను ఉచితంగా అందించామన్నారు. కరోనా సమయంలో 1,000 మందికి బాధితులకు ప్రభుత్వం  నిర్దేశించిన అతితక్కువ ధరకు  సేవలు అందించినట్లు పేర్కొన్నారు. సామాజిక బాధ్యతగా మాతా శిశు సంరక్షణ పఽథకాన్ని అమలు చేసి పుట్టిన బిడ్డలకు 12 ఏళ్లు వచ్చే వరకు రాయతీపై  వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. తాజాగా న్యూరాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ర్టోఎంట్రాలజీ సేవలను ప్రారంభిస్తున్నామన్నారు. కార్యక్రమంలో హాస్పటల్‌ ఎండీ ధూళిపాళ్ళ జ్యోతిర్మయి, మెడికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ చల్లగండ్ల శ్రీనివాస్‌, సీవోవో డాక్టర్‌ కరణం నవీన్‌, డాక్టర్‌ అమరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-28T04:12:34+05:30 IST