కష్ట కాలంలో అండగా నిలిచిన వారికి ధన్యవాదాలు

ABN , First Publish Date - 2021-05-30T05:53:40+05:30 IST

కష్టకాలంలో తమకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు సంగం డెయిరీ చైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్‌ శనివారం తెలిపారు.

కష్ట కాలంలో అండగా నిలిచిన వారికి ధన్యవాదాలు
ధూళిపాళ్ళ నరేంద్రకుమార్‌ను పరామర్శిస్తున్న మాజీ మంత్రి ఆనందబాబు తదితరులు

ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్‌


పొన్నూరుటౌన్‌, మే29: కష్టకాలంలో తమకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు సంగం డెయిరీ చైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్‌ శనివారం తెలిపారు. అవాంతరాలను అధిగమించి వ్యవస్థను కాపాడుకోవటంలోనూ కుట్రలు తిప్పికొట్టడంలో తమ వంతు కృషి చేస్తూ, మద్దతుగా నిలిచి సంగం డెయిరీ రోజు వారి కార్యకలాపాలను నిర్వహించిన పాలకవర్గ సభ్యులు, ఉద్యోగులు, పాడి రైతుల కుటుంబాలు, పాల ఉత్పత్తిదారుల సంఘాలు, డిస్ర్టిబ్యూటర్లు, ఏజెంట్లు, నాలుగు దశాబ్దాలుగా సంగం డెయిరీని ఆదరిస్తున్న వినియోగదారులకు నరేంద్రకుమార్‌ ధన్యవాదాలు తెలిపారు. అంతిమంగా న్యాయమే గెలుస్తుందనే ధృడమైన నమ్మకం ఉందన్నారు. కాగా ధూళిపాళ్లను శనివారం విజయవాడలో మాజీమంత్రి నక్కా ఆనందబాబు కలిసి పరామర్శించారు. అలాగే గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చిట్టిబాబు, పోతినేని శ్రీనివాస్‌, మద్దిరాల మ్యాని తదితర టీడీపీ నాయకులు ధూళిపాళ్ళ గృహానికి వెళ్లి అయినను కలుసుకొని పరామర్శించారు. 

Updated Date - 2021-05-30T05:53:40+05:30 IST