వైసీపీకి జీవనాడి డాక్టర్‌ రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ : ఎమ్మెల్యే రోశయ్య

ABN , First Publish Date - 2021-09-03T17:33:50+05:30 IST

నియోజకవర్గంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయం కోసం..

వైసీపీకి జీవనాడి డాక్టర్‌ రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ : ఎమ్మెల్యే రోశయ్య

పొన్నూరు: నియోజకవర్గంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయం కోసం పేదల వైద్యుడు డాక్టర్‌ నల్లమోతు రవీంద్రనాథ్‌ఠాగూర్‌ తుది శ్వాస వరకు పోరాడిన మహోన్నత వ్యక్తి అని  ఎమ్మెల్యే కిలారి వెంకటరోశయ్య ప్రస్తుతించారు. సీనియర్‌ వైసీపీ నాయకుడు దివంగత డాక్టర్‌ నల్లమోతు రవీంద్రనాథ్‌ఠాగూర్‌ ప్రథమ వర్ధంతి సందర్భంగా గురువారం చింతలపూడిలోని మొవ్వాగార్డెన్స్‌లో ఏర్పాటుచేసిన సంస్మరణ సభలో ఆయన  మాట్లాడారు. సభకు వైసీపీ నాయకులు, ఏజీపీ బొనిగల రాజారావు అధ్యక్షత వహించారు. సభలో ఎమ్మెల్యే కిలారి వెంకటరోశయ్య మాట్లాడుతూ డాక్టర్‌ ఠాగూర్‌ కుటుంబానికి వైసీపీ అండగా నిలుస్తుందన్నారు. తొలుత ఎమ్మెల్యే రోశయ్య, వైసీపీ నాయకులు, కుటుంబసభ్యులు డాక్టర్‌ రవీంద్రనాథ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రవి కార్డియాక్‌ అండ్‌ డయాబెటిక్‌ కేర్‌సెంటర్‌ అంబులెన్స్‌ను ఎమ్మెల్యే  ప్రారంభించారు.


మార్కెట్‌యార్డు చైర్మన్‌ బీ వేణుప్రసాద్‌,  వైసీపీ నాయకులు మాజీ మున్సిపల్‌ చైరపర్సన్‌ డాక్టర్‌ రూత్‌రాణి, డాక్టర్‌ రమ్యశ్రేష్ట, డాక్టర్‌ కీరిట్‌, ఎన్‌ జేమ్సు, వడ్రాణం ప్రసాదరావు, ఆకుల వెంకటేశ్వరరావు, బొద్దులూరి రంగారావు, లంకపోతు పిచ్చిరెడ్డి, షేక్‌ నాజర్‌, డాక్టర్‌ ఆనంద్‌, గోగినేని రజనీకుమార్‌, తజ్ముల్‌బేగ్‌, మాజీ కౌన్సిలర్‌ షబ్బీర్‌, కో ఆప్షన్‌సభ్యులు మగ్బుల్‌బేగ్‌, షేక్‌ కరిముల్లా, కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి జక్కాశ్రీనివాస్‌, బాపట్ల పార్లమెంటు వైసీపీ మహిళా అధ్యక్షురాలు డీ సుబ్బాయమ్మ, బిషప్‌ ఎలియా, మాలమహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు, సంపత్‌, చక్రధర్‌, మోహనరావు, టైటస్‌, ఆశ్వీరాదం   డాక్టర్‌ ఠాగూర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.

Updated Date - 2021-09-03T17:33:50+05:30 IST