అభివృద్ధి పనుల్లో జాప్యం వద్దు: ఎమ్మెల్యే గిరిధర్‌

ABN , First Publish Date - 2021-07-08T13:26:59+05:30 IST

అభివృద్ధి పనుల్లో..

అభివృద్ధి పనుల్లో జాప్యం వద్దు: ఎమ్మెల్యే గిరిధర్‌

గుంటూరు: అభివృద్ధి పనుల్లో నగరపాలక సంస్థ అధికారులు ఏమాత్రం జాప్యం చేయవద్దని పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌ పేర్కొన్నారు. రోజువారీ పర్యటనలో భాగంగా బుదవారం ఆయన కోబాల్డ్‌పేట ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్థానికుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చెత్తాచెదారాలు పేరుకుపోవటం, అస్తవ్యస్త కాల్వలు, అధ్వాన్నంగా ఉన్న రహదారులను పరిశీలించిన ఆయన అవసరమైన ప్రాంతంలో కల్వర్టులు ఏర్పాటుచేయాలని  అధికారులకు సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ బూసి రాజలత, జీఎంసీ అధికారులు శ్రీనివాసరెడ్డి, అనూష, వైసీపీ నాయకులు షేక్‌ గౌస్‌పీరా, షేక్‌ సుభాని, రాయప్ప, దేవానంద్‌, పఠాన్‌ సైదాఖాన్‌ తదితరులున్నారు. 


Updated Date - 2021-07-08T13:26:59+05:30 IST