పాల ఉత్పత్తిదారులకు బోనస్‌ పంపిణీ

ABN , First Publish Date - 2021-09-03T14:39:23+05:30 IST

మండలంలోని పూండ్ల గ్రామంలో..

పాల ఉత్పత్తిదారులకు బోనస్‌ పంపిణీ

బాపట్ల టౌన్‌: మండలంలోని పూండ్ల గ్రామంలో సంగండెయిరీ పాల సొసైటీ లో 67మంది పాల ఉత్పత్తిదారులకు రూ.2.52 లక్షల రూపాయలను బోనస్‌ అందజేశామని సంగండెయిరీ డైరెక్టర్‌ మరీదు వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డెయిరీ మేనేజర్‌ కట్రా నరేష్‌బాబు పాల్గొని రైతులకు అందించే సంక్షేమ పథకాలను గురించి వివరించారు. కార్యక్రమంలో డెయిరీ సూపర్‌వైజర్‌ ఉప్పాల సందీప్‌కృష్ణ, పూండ్ల నీటి సంఘం మాజీ అధ్యక్షుడు రావిపాటి రవి, ఆర్‌ఎన్‌వీ సత్యనారాయణ, పాల ఉత్పత్తిదారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-03T14:39:23+05:30 IST