కబళించిన కెరటాలు

ABN , First Publish Date - 2021-03-22T05:50:01+05:30 IST

కడలి కెరటాలు ఇద్దరు విద్యార్థులను కబళించాయి. మరొకరిని గల్లంతు చేశాయి. ఈ సంఘటన ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం కఠారిపాలెం సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది.

కబళించిన కెరటాలు
భరత్‌రెడ్డి మృతదేహం

సముద్రంలోకి దిగి ఇద్దరు విద్యార్థుల మృతి 

మరొకరు గల్లంతు

అంతా గుంటూరు జిల్లాకు చెందినవారు

ప్రకాశం జిల్లాలో ఘటన 

చీరాల టౌన్‌, మార్చి 21 : కడలి కెరటాలు ఇద్దరు విద్యార్థులను కబళించాయి. మరొకరిని గల్లంతు చేశాయి. ఈ సంఘటన ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం కఠారిపాలెం సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు.. గుంటూరు జిల్లా ఏటీ అగ్రహారానికి చెందిన ఉష(19), భరత్‌రెడ్డి(20), మహేష్‌, యశ్వంత్‌, హిమశ్రీ గుంటూరులోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో బీటెక్‌ చదువుతున్నారు. వీరంతా ఆదివారం మధ్యాహ్నం కఠారిపాలెం సముద్రతీరానికి వచ్చారు. సరదాగా లోపలికి దిగారు. కొద్దిసేపటి తర్వాత అలల తాకిడికి ఉష, భరత్‌, మహేష్‌లు సముద్రంలోకి కొట్టుకుపోయారు. కొంత సమయానికి ఉష, భరత్‌ మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. మహేష్‌ గల్లంతయ్యాడు. అతని కోసం పోలీసులు పోలీసులు గాలిస్తున్నారు. ఉష, భరత్‌రెడ్డి మృతదేహాలను చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. Updated Date - 2021-03-22T05:50:01+05:30 IST