అనుమానాస్పద స్థితిలో.. విశ్రాంత బ్యాంక్‌ మేనేజర్‌ మృతి

ABN , First Publish Date - 2021-10-14T06:05:38+05:30 IST

అనుమానాస్పద స్థితిలో విశ్రాంత బ్యాంక్‌ మేనేజర్‌ మృతి ఎస్‌వీఎన కాలనీలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది.

అనుమానాస్పద స్థితిలో..  విశ్రాంత బ్యాంక్‌ మేనేజర్‌ మృతి

గుంటూరు, అక్టోబరు 13: అనుమానాస్పద స్థితిలో విశ్రాంత బ్యాంక్‌ మేనేజర్‌ మృతి ఎస్‌వీఎన కాలనీలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. రావిపాటి జగన్మోహనరావు (68) ఎస్‌వీఎన కాలనీ 6/3లోని శ్రీనిలయం అపార్టుమెంటులో నివాసం ఉంటున్నారు. వెంకటేశ్వరస్వామి ఆలయ కమిటీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న ఆయన ఉదయం రోజు మాదిరిగానే గుడికి వెళ్లారు. పది నిమిషాల తర్వాత వెనుతిరిగి వచ్చి తన ఫోను మరిచిపోయానని చెప్పి తీసుకుని గుడికి బయలుదేరి వెళ్లారని భార్య పద్మ తెలిపారు. కొద్ది సమయం తర్వాత అపార్టుమెంట్‌ వాచమన అపార్టుమెంట్‌ వెనుక ఎవరో పడిపోయి ఉన్నారని చెప్పాడు. అక్కడకు వెళ్లి చూడగా   జగన్మోహనరావు పడి ఉన్నారు. అపార్టుమెంటు పైనుంచి దూకాడా? లేదంటే ప్రమాదవశాత్తు జారిపడ్డాడా అనేది తెలియడంలేదని పోలీసులు తెలిపారు. వెస్టు డీఎస్పీ సుప్రజ, పట్టాభిపురం సీఐ రాజశేఖరరెడ్డి, ఎస్‌ఐ రెహ్మాన తదితరులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

  

Updated Date - 2021-10-14T06:05:38+05:30 IST